ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి ): శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని టేకులపల్లి గ్రావిటి ప్రీమియర్ పాఠశాల లో విద్యార్థులు గోపికంమ్మా అంటు పాటలు పాడుతూ సందడిచేశారు. శ్రీకృష్ణుని వేషధారణ తో గొల్ల భామలు వేషధాలులతో ఉట్టి కొట్టే ప్రక్రియను ఎంతో ఆనందదాయకంగా ఆటపాటలతో నిర్వహించారు . బొమ్మనపల్లి బోడు ముత్యాలంపాడు కోయగూడెం తదితర గ్రామాలలో చిన్నపిల్లలను శ్రీకృష్ణ గోపికమ్మల వేషధారణలతో చక్కగా అలంకరించి నృత్యాలు చేయించారు .