కురవి రూరల్ జనంసాక్షి అక్టోబర్ 6: తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగగా దసరా కావడంతో తొమ్మిది రోజులకు ముందే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి చివరి రోజు సద్దుల బతుకమ్మ కావడంతో ఈ సందర్భంగా బలపాల గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ముండ్ల ప్రమీలరమేష్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ మహిళలు యువతీ యువకులతో కలిసి ఊరేగింపుగా సద్దుల బతుకమ్మను తీసుకెళ్లి అంగరంగ వైభవంగా చెరువులలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, ఎంపీటీసీ పిట్టల రమణ ఉపేందర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మామ సైదులు, గుండేటి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




