Tuesday, 3 November 2026

ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ

అల్లాదుర్గం     జనంసాక్షి
అల్లాదుర్గం  మండలపరిదిలోని బహిరన్ దిబ్బ గ్రామంలో  బతుకమ్మ సంబరాలుఅంబరాన్ని తాకాయి.
గ్రామములో  మహిళలు తంగేడు గునుగు  సీతాజడలు  బంతి చామంతి  ఫిరంగి  గన్నేరు  తీరొక్కపూవులతో  బతుకమ్మలను అందంగపేర్చి  గ్రామంలోని వాడ వాడల నుండి బతుకమ్మ ల నెత్తుకొని  డప్పు చప్పుడుతో  ఊరేగింపు గా  హనుమాన్ దేవాలయంవద్దకు చేరి అందరూ ఒకచోట బతుకమ్మలు పెట్టి ఉయ్యాల బతుకమ్మ  ఆటలుపాటలతో  ఊరు మార్మోగింది సాయంత్రం వరకు ఆడబిడ్డలు ఎంతో  సంతోషంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు  పట్టు చీరల  తళుక్కులు  సప్తవర్ణ శోభితంగా బతుకమ్మ పండుగ కు కొత్తవన్నెను తెచ్చాయి  చిన్నారులు  యువతులు   డి,జె .బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్దంగా  నృత్యాలు చేస్తూ  బతుకమ్మ పండుగను  సంబరంగా జరుపుకున్నారుఅనంతరం  మహిళలు బతుకమ్మలనెత్తుకొని బారి ఊరేఘింపుగా ముందుకు కదులుతూ   గంగదారి వాగుల కాళీ కడెం పాయెనే  గౌరమ్మరాచోటి   కడె మందున  గౌరమ్మ రాగి బోనమందున   గౌరమ్మ పాటలు పాడుకుంటూ  గౌరమ్మకు ప్రతీక అయిన బతుకమ్మ ను గ్రామ సమీపంలోని   వాగులో గంగమ్మ సన్నిధిలో నిమజ్జనం  చేసి పోయిరా బతుకమ్మ  పోయిరావమ్మా అంటూ    వాయనాలు పంచుకుని బతుకమ్మ  పండుగ ఘనంగా జరుపుకున్నారు  ఈ పండుగ సందర్బంగా బహిరన్  దిబ్బ సర్పంచ్ కొరమని  లక్ష్మమ్మ   బతుకమ్మ  పండుగకు తగు ఏర్పాట్లు చేశారు