ఘనంగా 115వ భగత్ సింగ్ జయంతి
టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి సమితి అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు 115వ భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె సారయ్య, జిల్లా సమితి సభ్యులు గుగ్గులోత్ రామచందర్ మాట్లాడుతూ విద్యా, వైద్యం, సమానత్వం అనే హక్కుల సాధనకై పోరాడిన మహానుభావుడు భగత్ సింగ్ బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టిన మహనీయుడు అని కొనియాడారు. ఇలాంటి మహానుభావుడు పుట్టిన ఈ గడ్డమీద ప్రస్తుతం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్న తీరు చూస్తే ఎంతో సిగ్గుచేటుగా ఉంది అని అన్నారు . తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో కి వస్తే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని ప్రకటించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీని నెరవేర్చలేక పోతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి గుగులోతు శ్రీను, ఎజ్జు భాస్కర్, వాసం భద్రయ్య, బానోతు వీరన్న ,తేజవత్తు మధు, అయిత శ్రీరాములు, బండి వీరభద్రం , విజయలక్ష్మి గుగ్గులోత్ సోనీ, సతీష్ ,తేజావత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.