Wednesday, 4 November 2026

చండ్రుగొండ  జనం సాక్షి(ఫిబ్రవరి 08

 అంగన్వాడీ కేంద్రాలకు పంచాయితీ వాహనాలలోనే  రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందని  సీడీపిఓ  నిర్మలాజ్యోతి అన్నారు.మండలంలోని టేకులపల్లి,  వెంగళరావుకాలనీ,తు గారం   గ్రామ     పంచాయతీలలో నీ అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం  ఆమె సందర్శించారు  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద  చండ్రుగొండ మండలంలో పంచాయతీ   ట్రాక్టర్ల ద్వారా  అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా విధానాన్ని పరిశీలించారు  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రతీ పంచాయతీలో ఇకపై ట్రాక్టర్ల ద్వారానే బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు  కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ సూపర్వైజర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.