|
బాల్కొండ కమ్మర్పల్లి ఫిబ్రవరీ 08 జ
నం సాక్షి బాల్కొండ మండల కేంద్రంలో ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన శ్రీ నిమిషంభ దేవి ఆలయానికి పెళ్లి వివాహ వేడుకల హాల్ మంజూరీ పట్ల నిమిషంభ దేవి ఆలయ కమిటీ శ్రీ సోమక్షత్రీయ “నకాశ్”సంగం హర్షం వ్యక్తo చేశారు,మంగళ వారం ఉదయం బాల్కొండ ఎం.ఎల్.ఏ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,మరియు
నిజామాబాద్ సహాయక కమిషనర్ సోమయ్య ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపినారు.తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు 13 లక్షల అంచనా వ్యయంతో తైయారు చేసిన ప్రతి పాదనల కాపీలను నిజామాబాద్ దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ ఆలయ కమిటీకి చెందిన బి.గంగాధర్ (చౌదరి)బి.ఆర్.నర్సింగ్ రావు,బి.రవికిరన్,అందజేశారు.ఇది ఇలా ఉండగా ఆలయం ద్వారా మూడు లక్షల రూపాయలు దేవాదాయ శాఖకు త్వరలో చెల్లిస్తామని వారు అధికారికి వివరించారు.
ఆలయ స్థల పురాణం●●●●●●●◆◆◆●●●●●●●●●●●●●●
భారత దేశంలో శ్రీ నిమిషంభ దేవి ఆలయం మధ్య ప్రదేశ్ లోని అమరకంటాక్ నేమిశ్రణ్యం మేకల పర్వతం
పైన ఉద్భవించిన మొదటి ఆలయం కాగా కర్ణాటక
రాష్ట్రంలో గంజాం పట్టణానికి “కావేరి”నది తీరంలో
2వ ఆలయం,ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ (తుంగ భద్ర నది పరివాహక ప్రాంతం)లో మూడవ ఆలయంగా,నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 518 సంవత్సరాల నుండి బాల్ కొండలో కొలువై ఉన్న శ్రీ నిమిషంభ దేవి ఆలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం గత ఆరు(06) సంవత్సరాల 09 నెలలుగా అన్నదానం జరగటం విశేషం.
అత్యంత ప్రముక్యత చెందిన ఆతి పురాతన మైన శక్తి పీఠం బాల్కొండలో వెలిసిన శ్రీ నిమిషంభ దేవి ఆలయం, దేశంలోనే 4వ ఆలయంగా ప్రసిద్ధి,ఇది ఇలా ఉండగా
బాల్కొండలో వెలసిన ఆలయం శ్రీ సోమక్షత్రియ ఆది దేవత పంచలోహ విగ్రహన్నీ 1059 నుండే పూర్వీకులైన పెద్ద లిమ్బన్న,నడిపి నర్సింలూ,లింబగిరి ఉమ్మడి జిల్లా అయిన కరీంనగర్ జిల్లా మెటపల్లి తాలూకా బండలింగపురానికి చెందిన బ్రహ్మణుడైన గోవిందయ్య నేతృత్వంలో పూజలు జరిగేవి,2003 లో ఆలయం పున:నిర్మాణం పిదప
బాల్కొండలో పున:ప్రతిష్ఠాపన జరిగింది.శ్రీ నిమిషంభ దేవి ఆలయానికి దక్షిణ తూర్పు ఆగ్నేయంలో (09)కొండల చేత కూడుకున్నది, ఈ ఆలయం పడమరవైపు దేశం లో (2) వ విద్యాదేవి శ్రీ సరస్వతి (బాసర)కాగా, ఉత్తర భాగం అంటే సీత రామ లక్మణులు ప్రతిష్టించిన ఇసుక లింగం(కుస్థాపురం)ఈ ఆలయం ఎదురుగా గోధవరి రెండు పాయలుగా విడిపోయి మళ్ళీ దక్షణ వైపు అనగా అమ్మవారికి అభిముకముగా ఈ గోదావరి నీరు పారుతుంది,
ఈ నీరు ప్రవహించే చోట”సాలిగ్రామకూడలి”
ఉండటo విశేషం.
ఈ అద్భుత సన్నీవేశం ఇక్కడికి (09) కిలోమీటర్ దూరంలోనే”సోన్”(సోన్న)గ్రామం గోదావరి నది కుడి వైపు ఉండటం విశేషం.ఇక్కడే నర్సింగ్ రావు,ఐ.ఏ.ఎస్ ఉన్నత అధికారి నేతృత్వంలో నేటికి వేద పాఠశాల కొనసాగుతూ ఉంది.బాల్కొండ లో కొలువై ఉన్న నిమిషంభ దేవి సంతానం లేని వారికి సంతానం,చేతబడినుండి విముక్తి, ఈలాంటి మహిమలు గల విగ్రహం ఈ రాష్ట్రంలోన
ఏ నిమిషంభ దేవి ఆలయాల్లో లేదని,ఈ విగ్రహం పూర్వీకుల ఋషుల నుండి పూజలు అందుకొంటున్న సిరులు కురిపించే దేవి నిమిషంభ ఆనాటి అల్లకొండ నేటి బాల్కొండలోనే ఉంది.
భక్తుల కొంగు బంగారంలా కొరికెలు తీరుస్తూ ఉందని ఆలయ ప్రధాన పూజారి శ్రీ శ్రీ కృష్ణ రావు జోషి తెలిపినారు.
Attachments area
|
నిమిషంభ దేవి ఆలయానికి కళ్యాణ వేదిక (హాల్)మంజూరీ

ఆలయ స్థల పురాణం


