హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడితో గుంటూరు, విజయనగరం, విశాఖ జిల్లాల నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని, విశాఖ లో రెండు స్థానాలకు పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఓ అభ్యర్థిగా సీనియర్ నేత చలపతి రాయుడు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండో అభ్యర్థి సందిగ్ధత నెలకొంది.




