చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
జహీరాబాద్ సెప్టెంబర్ 1( జనంసాక్షి )ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం లోని లింగంపల్లి హాస్టల్ లో కరెంట్ షాక్ తో మరణించిన సాయి కుమార్ గౌడ్ అనే విద్యార్థిని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ పార్టీ నాయకులు తో కలిసి పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చేత ఎలక్ట్రిక్ పనులను చేయించడం కరెక్ట్ కాదని స్కూల్ యాజమాన్యాన్ని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన కుటుంబానికి 50 లక్షల పరిహారం,తో పాటు కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అన్నారు. . ప్రతి పాఠశాలలో ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఎలక్ట్రీషియన్ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.