Wednesday, 4 November 2026

వైద్యుడి అసత్య ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే బేతి

ఉప్పల్(జనంసాక్షి):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జమ్మిగడ్డ లో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా డాక్టర్ స్వప్న రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆగస్టు నెల 19వ తేదీన అక్కడకు వెళ్లడం జరిగినది. పేషెంట్లకు పండ్లు పంపిణీ  చేసి వెళ్తున్న క్రమంలో  అక్కడున్న వైద్య సిబ్బంది వచ్చి ఈ హాస్పిటల్కు వైద్యులు  ఒకరు కొత్తగా వచ్చారంటూ చెప్పడం జరిగింది అప్పటికే ఆ వైద్యాధికారి ఇతర కాలనీవాసులతో పేషంట్లతో వాగ్వాదం చేస్తున్నట్లు నాకు అక్కడున్న వారు సమాచారం అందించారు. నేను వైద్యాధికారితో ముఖాముఖి మాట్లాడ డం, తిట్టడం గాని ఎక్కడ చేయలేదు. అలాంటిది ఏదైనా ఉంటే మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కాలనీవాసులపై అక్కడున్న స్థానిక ప్రజలపై పేషంట్లపై దురుసుగా ప్రవర్తిస్తున్న వైద్యాధికారిపై అక్కడున్నవారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.  నేనే అక్కడున్న స్థానికులను వారించడం జరిగింది. అలాంటి వ్యక్తులు వైద్యం చేయడానికి పేషెంట్లకు ఇబ్బంది కరంగా ఉంటుందని ఉద్దేశంతో నేను అక్కడున్న వారి ఫిర్యాదు మేరకు డిఎంహెచ్ఓ తో మాట్లాడడం జరిగింది అంతేగాని అక్కడున్నటువంటి వైద్యాధికారితో గాని ఇతర వైద్యులపై గాని నాకు ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గాని దురుద్దేశం గాని లేదు. నాకు ఆ వైద్యుడు కూడా ఎవరో తెలియదు. వైద్యులు అంటే నాకు అమితమైన గౌరవం ఉంది అదే గౌరవాన్ని కాపాడుకుంటాను. మీరు ఏ వైద్యులను అడిగినా కూడా ఎమ్మెల్యే గారు ఎలాంటి వ్యక్తి అనేది చెప్తారు.  దీన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ప్రభుత్వంపై గాని ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కేసీఆర్  పై గాని శాసనసభ్యులపై గాని ఎలాంటి గౌరవం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వంపై నిత్యం ఆరోపణ చేసే వ్యక్తుల దగ్గరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి వైద్యులు వెళ్లడం అనేది దురదృష్టకరం . ఈలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఒక శాసనసభ్యులను కించపరిచే విధంగా మాట్లాడుతుంటే చూస్తూ కూర్చున్న వ్యక్తి ,  నేడు గౌరవం గురించి మాట్లాడుతున్నారు.  మీరు గమనించాలి. ఒక వైద్యు వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా పేషన్స్ ఉండాలి కానీ ఆ పేషన్స్ ఉన్నట్టు ఎక్కడ ఆ  వైద్యుడికి  కనిపించడం లేదు. కాలనీవాసులపై పేషంట్లపై ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తున్న వైద్యుడి పై పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఆ వ్యక్తిని బదిలీ చేయడం జరిగిందని విషయం నా దృష్టికి వచ్చింది. మరి ఇలాంటి వ్యక్తులను నిత్యం బదిలి అయితున్నారనే విషయం అతనే చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇట్లా బదిలి అవుతుందనే విషయం ప్రజలు గమనించాలి. దీన్ని అర్థం చేసుకోకుండా అసత్య ఆరోపణ చేసే వ్యక్తులను ఎప్పటికీ ప్రజలు నమ్మరు.
మరొక విషయం పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్స్ ను వైద్యం వదిలి రమ్మని ఎవరు చెప్పారు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడానికి మేము వెళ్లడం జరిగింది అలాంటి క్రమంలో వైద్యం అందించే డాక్టర్స్ ను వదిలి రమ్మని ఎలా చెప్తాం. మరి నేను హాస్పిటల్లోనే పేషెంట్స్ కు పండ్లు పంపిణీ చేస్తున్న డాక్టర్ ఎక్కడ వైద్యం అందిస్తున్నాడో మాకు కనిపించలేదు ఒకవేళ వైద్యం అందిస్తుంటే మాత్రం ఎలాంటి వ్యక్తులు కూడా వదిలి రమ్మని చెప్పారు ఇలా చెప్పడం జరుగుతుందంటే కావాలని దురుద్దేశంతో కూడుకొని ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఎవరో రాజకీయంగా తనను అబాసుపాలు చేసే విధంగా వీరిని ప్రోత్సహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నయి.
ఉద్యమకారుడిగా, తెలంగాణ కోసం ప్రజల కోసం పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. నాపై ఎంతమంది ఎలాంటి అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసిన భయపడను. నిజం నిదానంగా బయటికి రాక తప్పదు.
ప్రజల నుంచి, కాలనీవాసుల నుంచి, పేషంట్ల నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రశ్నించే హక్కు ప్రజా ప్రతినిధిగా నాకు ఉంది. కరోనా సమయంలో ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసిన ఎంతోమంది వైద్యులకు నేను అండగా నిలిచాను.  వారిని సన్మానించి, గౌరవిస్తూ తోడ్పాటు అందించాను. ఇలాంటి కొంతమంది వైద్యులు చేసే అసత్య ఆరోపాలను నమ్మవద్దని,  సహచర వైద్య సిబ్బందికి వైద్యులకు విన్నవిస్తున్నాను. మీడియా మిత్రులు, పత్రికా సోదరులు,  వైద్యుడి తీరును ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి పరిశీలించాలని విన్నవిస్తున్నాను. ఈ  కార్యక్రమంలో మీర్పేట్ హెచ్. బీ కాలనీ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ ,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు డప్పు గిరిబాబు, పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, డాక్టర్ బీవీ చారి, సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, కంచర్ల సోమిరెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి,ఎం.డి రెహమాన్, శీతల విజయ్ కుమార్ , సూర్ణం శంకర్, రాజు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.