చర్మకారులకు అండగా ఉంటా: చంద్రబాబు

హైదరాబాద్‌:చర్మకారులకు అండగా నిలుస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వర్గీకరణ సాధించేవరకు మాదిగ సోదరులకు తెదేపా అండగా ఉంటుందని అయన అన్నారు.కనీసం పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో చర్మ కారులు ఉన్నారన్న ఆయన,రాష్ట్ర లెదర్‌ తమిల్‌నాడు తరలించకుండా ఇక్కడే ఉపాధి కల్పించాలపని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పేదవారికి తక్కువ ఖర్చుతో ఉచితంగా గ్యాస్‌ సిలెండర్లు ఇచ్చిన ఘనత తెదేపాదేనని బాబు గుర్తు చేశారు.