హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను ఎసిబి కోర్టు మంజూరు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ కు అనుమతి ఇచ్చారు. 12 గంటలపాటు రేవంత్ రెడ్డిపై ఎస్కార్ట్ నిఘా ఉంటుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి బయల్దేరారు




