ఎమ్మెల్సీ నాగేశ్వర్
రాంనగర్ (హైదరాబాద్) : తన నియోజకవర్గం లోని హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధాన బస్టాండ్‌ల వద్ద చలివేంద్రాల ఏర్పాటుకు తాను రూ. 55లక్షల రూపాయల నిధులు కేటాయించినా , ఆర్టీసీ అధికారులు సహకరించడం లేదని ఎమ్మెల్సీ నాగేశ్వర్ సోమవారం ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు. బన్ భవన్ వద్ద ఆయన ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులు తాగునీరు కోసం లీటరుకు రూ. 20 చెల్లించాల్సి వస్తుందన్నారు. మాజీ ఎంపీ మధు, ఎమ్మెల్సీ చుక్కారామయ్య, చంద్రశేఖర్, రాఘవులు, రేవంత్ రెడ్డి, జూపూడి తదితరులు మద్దతు పలికారు.




