Wednesday, 4 November 2026

చలో కామారెడ్డి సభను విజయవంతం చేయాలి

కాంగ్రెస్ పార్టీ నాయకులు
బిచ్కుంద (జనంసాక్షి) నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి సారిగా విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలందరూ ఘన స్వాగతం పలకాలని బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తెరాస పార్టీ కాపీ చేసిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కమల్ కిషోర్ భట్టడ్, శివరాజ్ పాటిల్, గోనె యాదయ్య, హఫీజ్ గౌస్, గంగాధర్, నయిమ్ ఫ్లవర్, విరేందర్, విఠల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగ్నాథ్ పటేల్, సాగర్, దేవర్శెట్టి అశోక్, మునీర్ మరియు పీరయ్య తదితరులు పాల్గొన్నారు.