తాండూర్ అక్టోబర్ 19 (జనం సాక్షి)
బిజెపి పట్టణ కార్యదర్శి అభిషేక్ సంగిశెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు .రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో త్వరలోనే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సుమారు 500 మంది యువకులతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితుడినై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు వర్గపోరు వల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.




