చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం రైతు వేదిక దగ్గర జరుగుతున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయ్ యూనియన్ అధ్వర్యంలో తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ సిపిఎస్ ఈయూ గద్వాల జిల్లా అధ్యక్షులు వడ్డే నాగరాజు కోరడం జరిగింది.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు లక్షల పదివేల సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సీపీయస్ సమస్య, వారి కుటుంబాల ఆవేదననూ, ఉద్యోగికి భద్రత లేకపోవడంతో కుటుంబం అభద్రత భావానికి గురి కావడంతో చేసే పనిలో ఏకాగ్రత నశించి అనేక దుష్పరిణామాలను చవి చూడడం జరుగుతుందని వివరించారు. అంతే కాకుండా ఈరోజు ఉద్యోగులు పొందుతున్న జీతంతో సంతృప్తి చెంది, భవిష్యత్తులో ఎదురుకోబోయే భారి ముప్పును పసిగట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసి, సిపిఎస్ విధానంలో ఉండి పదవీరమున పొందిన, అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ లేకపోవడం వల్ల ఎంత నష్టమో, ఎన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సమస్య మనదిగా భావించి ప్రతి ఒక్కరు ఆగస్టు 12వ తారీఖున హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల ముందు ఉద్యోగులకు సంతృప్తి కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీపీయస్ రాష్ట్ర సహ అధ్యక్షులు విష్ణు,జిల్లా బాధ్యులు భాస్కర్,శంకర్ లాల్, ముఖ్య ప్లానింగ్ ఆఫీసర్ సుబ్రమణ్యం , జిల్లా అగ్రికల్చర్ అధికారి గోవింద్ నాయక్,ఉద్యన వన అధికారి అక్బర్, అలంపూర్ డైరెక్టర్ సక్రియ నాయక్,గద్వాల డివిజన్ డైరెక్టర్ సంగీత లక్ష్మి, మండల అగ్రికల్చర్ అధికారులు శంకర్ లాల్ ,అనిత, శ్రీలత, కరుణ శ్రీ,రాధ,సురేందర్,ప్రతాప్,రాజశేఖర్, ఏఈవోలు లోకరాజు,నరసింహ,అనూష, భరత్ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.