చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు
అయిజ, సెప్టెంబర్ 10 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి సూచన మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో యువ అధ్యక్షులు అంజి స్నేహ టిఫిన్ సెంటర్ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఐజ పాత బస్టాండ్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి పట్టణ అధ్యక్షుడు నరసింహయ్య శెట్టి మండల అధ్యక్షుడు శేఖర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మన్న గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఆది బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.