పేరుకుపోయిన చెత్తకి బాధ్యులెవరు?
-పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
టేకులపల్లి, సెప్టెంబర్ 10( జనం సాక్షి ): టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లందు ,కొత్తగూడెం ప్రధాన రహదారి వెళ్లే మార్గం మధ్యలో భీమ్ సింగ్ తండా సమీపంలో ఉన్న చెత్త గత 15 రోజుల నుంచి పట్టించుకోకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అసలే వర్షాకాలం కావడంతో తడిసి మరింత ఘోరంగా ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో చెత్తాచెదారంతో దారుణంగా కనపడుతోంది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త అంటూ ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్ లకు తరలిస్తూ ఉంటారు. గత 15 రోజులుగా ప్రజలందరికీ కనపడుతున్న పాలకులకు అధికారులకు కనపడకపోవడం మరీ దారుణం. పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల నిర్లక్ష్యమో కానీ చెత్త కుప్పలు పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా పాలకుల అధికారులు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి చెత్త పై దృష్టి సారించి తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.