Wednesday, 4 November 2026

చాలాకాలంగా గంటా శ్రీనివాస్‌ పక్కపార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం నలుగుతోంది

మొదట్లో వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా వర్కవుట్‌ కాలేదు. మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు బహిరంగ వేదికలపైనే వ్యతిరేకించారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్న గంటా.. మధ్యలో కాస్త యాక్టివ్‌ రోల్‌ తీసుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా అధినేతతో సమావేశానికి గంటా డుమ్మాకొట్టడం వెనక అసలు కారణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, తెలుగుదేశం జట్టుకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్ధాయిలో ఇప్పటికే రెండుపార్టీలు ఒక అవగాహనకు వచ్చేసినట్టే చెబుతున్నారు. ఈ తరుణంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలనేది గంటా ఆలోచనగా ఉన్నట్లుగా ఉంది.మొత్తంగా రాజకీయంగా లబ్ది కలిగితే తప్ప కదలని స్థితిలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడన్న ప్రచరం సాగుతోంది. వైసిపికి పూర్తిగా వ్యతిరేకత వస్తే తప్ప ఆయన
టిడిపికి చేరువ కాలేరు.