Tuesday, 3 November 2026

చింతపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ.

– వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య

కురవి సెప్టెంబర్-26 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలంలోని చింతపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయము నందు ఉపసర్పంచ్ రంగన్న గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల వైస్ ఎంపీపీ దొంగలు నరసయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేయడం జరిగిందని, చింతపల్లి గ్రామము నందు పంపిణీ లో పాల్గొనడం చాలా ఆనందంగా అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు అన్నలాంటి కెసిఆర్ కు అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వార్థుసభ్యులు నరహరి, మంగమ్మ ,రేషన్ డిలర్ దేవకమ్మ ,అంగన్వాడీ టిచర్లు శ్రీదేవి, రూప , పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ ,గ్రామ పంచాయతీ సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.