హైదరాబాద్: ఈనెల 19న విజయవాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దొంగలు తీసుకొచ్చిన బంగారాన్ని కొనుగోలు చేస్తున్న కేసుల్లో నిందితుడిగా ఉన్న వినోద్ కదాంబ్‌ను విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసులు రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విచారణ సమయంలో వినోద్ పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అప్పటి నుంచి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడు.




