చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం గుంతల మయం
చెరువును తలపిస్తోన్న యాచారం కందుకూరు రోడ్డు
రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-
యాచారం నుండి కందుకూర్ వెళ్ళే రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడి చిత్తడిగా మారింది. అసలే గోతులమయంగా ఉండే ఈ రోడ్డు, చిన్న పాటిగా కురిసిన వర్షానికి మరీ దారుణంగా తయారైంది. చిన్న వర్షానికే రోడ్లపై ఉండే గుంటల్లో నీళ్లు నిలిచి, ప్రయాణికులకు నరకం కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ యాచారం మండల అధ్యక్షుడు మస్కు నర్సింహా అన్నారు.గురువారం గుంతల మయం అయిన రోడ్డును ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఈ రోడ్డు నుంచి వివిధ గ్రామాలకు వందలాది మంది ప్రయాణిస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్డును సంబంధిత అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వదిలేయకుండా, మరమ్మత్తులు చేయాలని లేనిచో స్థానిక ప్రజలు వాహనదారులతో కలసి ఆందోళన చేస్తామని ప్రభుత్వం ను హెచ్చరించారు