హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి… చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం…. జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కుమార్తె ధృతి (5). స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి ముందు ఆడుకుంటున్న ధృతి వద్దకు ఓ మహిళ వచ్చి తనతో వస్తే చాక్లెట్ కొనిస్తానని చెప్పి…ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని సాకేత్ సమీపంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ గల్లిలో బాలిక చెవులకు ఉన్న 2 గ్రాముల బంగారు పోగులు, 5 తులాల కాళ్లపట్టీలను తీసుకుని పారిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.




