చిన్న వెంకులు కుటుంబానికి పరామర్శ
: చిత్రపటానికి పూలమాల వేస్తున్న జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు
పెన్ పహాడ్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) : మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి చిన్న వెంకులు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటానికి దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకులు లేని లోటు కుటుంబానికి తీరనిలోటని ఆయన అన్నారు. సంతాపం తెలిపిన వారిలో జడ్పిటిసి మామిడి అనిత, అంజయ్య, వెంకటయ్య, నాయకులు కట్టెల విజయ్ కుమార్, సింగం వెంకన్న ,మోదాల నాగేష్ ,వాస రాములు, వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area