చెన్నూరు పట్టణంలోని చెన్నూరి నివాసి అయిన ఆలం వెంకటేష్ భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చెన్నూరి నివాసి అయిన ఆలం వెంకటేష్ తండ్రి పేరు పోశం అను వారిది కొంతమంది రాజకీయ పలుకుబడి మరియు డబ్బు న్న వారు వీరి యొక్క భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ (BSP) ఉమ్మడి ఆదిలాబాదు మహిళా జోనల్ కన్వీనర్ మద్దల భవాని మరియు జిల్లా సీనియర్ నాయకులు జాగిరి రాజేష్ గార్లు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి వారి తండ్రి గారి వారసత్వంగా వచ్చిన భూమి సర్వే నెంబరు 852 గత ప్రభుత్వాలు దళితులకు మరియు బీసీలకు కేటాయించగా బాధితులుగా వారి తాతగారు తర్వాత వారి తండ్రిగారు తదనంతరం వెంకటేష్ సాగు చేసుకుని వారి కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది. వారి పేదరికంని ఆసరా చేసుకుని కొంతమంది బడా బాబులు వీరి యొక్క 26 గుంటల విలువైన భూమిని కబ్జా చేసుకుని బాధిత కుటుంబాలను బెదిరించడం జరుగుతుంది. బాధిత కుటుంబానికి బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈరోజు వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వీరి పోరాటానికి మద్దతిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పైడిపల్లి సాయికుమార్, హాజీపూర్ బిఎస్పి మండల కన్వీనర్ దేవి లక్ష్మి శోభ భాగ్య సుజాత శారద భాగ్యలక్ష్మి తదితర నాయకురాలు పాల్గొన్నారు.

తాజావార్తలు