చేప పిల్లల పంపిణీతో ముదిరాజుల ఆర్థిక ఎదుగుదల
లకుడారం సర్పంచ్ కందూరి కనకవ్వ- ఐలయ్య
కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 11 : మండలం లకుడారం గ్రామంలో గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్వ- ఐలయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ఉచితంగా అందజేసిన చేప పిల్లలను లకుడారం గ్రామ చెరువులో మంగళవారం వదిలారు.
సందర్భంగా గ్రామ సర్పంచ్ కనకవ్వ ఐలయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్నటి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజు కులస్తుల ఆర్థిక ఎదుగుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముదిరాజుల ఆర్థిక ఎదుగుదల కు ఉపయోగపడే విధంగా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ముదిరాజుల తరఫున,గ్రామప్రజలందరికీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రపాల్గొన్నారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవి రవీందర్ ముదిరాజ్ సంఘం సభ్యులు అనేమైన నర్సింహులు కంకణాల పెంటయ్య ఈగ దుర్గయ్య మంజే స్వామి చీకోటి పునీందర్ కంకణాల బిక్షపతి ఎల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.