Thursday, 5 November 2026

ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి

. లెఫ్ట్ కల్నాల్ మాచర్ల బిక్షపతి
బచ్చన్నపేట అక్టోబర్ 11 (జనం సాక్షి) రాష్ట్రంలో ముదిరాజులు రాజకీయంగా ఎదగాలని 25 సంవత్సరాలు భారత సైన్యంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ లెఫ్టు కల్నల్ మాచర్ల బిక్షపతి అన్నారు. మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని వైద్య సేవలు పరంగా ఎల్లప్పుడూ తమకు అందుబాటులో ఉంటానని 14 శాతం ఉన్న ముదిరాజులకు రాజకీయాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానందం. ఉపాధ్యక్షులు పిట్టల సత్యం. యువత ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్. బచ్చన్నపేట మండల అధ్యక్షులు గంగరబోయిన ఉప్పలయ్య. ప్రధాన కార్యదర్శి గిరబోయిన బాల సిద్ధులు. ఉపాధ్యక్షులు ఎద్దు నాగయ్య. ముఖ్య సలహాదారులు . రెడ్డబోయిన హరికుమార్. యూత్ అధ్యక్షులు నీల రమేష్. ముదిరాజు నాయకులు నీల కుమారస్వామి. నీల పవన్. వద్ది ఎల్లయ్య. పేర బోయిన పరశురాములు. పిట్టల రాములు. ఎద్దు రమేష్. వద్ది క్రాంతి. ఉన్నారు
Attachments area