ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్
తాండూరు జనవరి13( జనం సాక్షి)
చైనా వస్తువుల తో పర్యావరణానికి ముప్పు తో పాటు పక్షులకు కూడా హాని కలుగుతుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్ అన్నారు.
ఆదివారం తాండూరు పట్టణంలోని పలు దుకాణాలను తనిఖీ చేసి అని కలిగిస్తున్న చైనా మాన్యం స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా చిన్నారులు గాలి పటాలు ఎగురవేయడం సర్వసాధారణం .అయినప్పటికీ నిషేధిత చైనా మాంజా తో చెట్లపైనా కూర్చునే పక్షులకు ప్రమాదం పొంచి ఉండటంతో దీనిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందరరావు నేతృత్వంలో చైనా మాంజా విక్రయదారుల షాపులపైనా తనిఖీ చేసి పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకుని అగ్నిలో తగులబెట్టడం జరిగింది.అదే విధంగా అనుమతి లేని కార్పెంటర్ దుకాణాల్లో అక్రమ కలాపాను విక్రయిస్తున్నారా అనే దానిపైన ప్రత్యేక తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తాజుద్దీన్ సిబ్బంది ఉన్నారు .




