Tuesday, 3 November 2026

లారీ డీకొని కార్మికుడు మృతి 

హత్నూర,(జనం సాక్షి)
లారీ డీకొని కార్మికుడు మృతి చెందిన  సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లమాచు నూర్ గ్రామ శివారులో గల అరబిందో యూనిట్-9 పరిశ్రమ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలం పరిధిలోని పల్పనూర్ గ్రామానికి చెందిన చాకలి లింగయ్య  (45) గత కొన్నేళ్ళుగా గ్రామ సమీపంలోని అరబిందో యూనిట్-9 రసాయన పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడుగా విధులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి పూట విధుల్లో చేరడం కోసం తన ద్విచక్రవాహనంపై ఇంటి నుండి బయలుదేరి వెళ్ళారు.పరిశ్రమ గేటుముందుకు చేరుతున్న క్రమంలో నర్సాపూర్ నుండి సంగారెడ్డి వైపు వెళ్తున్న లారీ ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా డీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబీకులు బోరుణ విలపించారు.మృతునికి భార్య యాదమ్మ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీనీ,లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.మృతుని భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.