హైదరాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది నిందితులను సోమవారం విూడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి 11 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో చోరీ కేసులో దొంగను అరెస్ట్ చేసి..అతని దగ్గర నుంచి 9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.




