హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్ను ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోమవారం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న జగన్కు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే వైకాపాలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.




