జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబానికి దాసరి పరామర్శ

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 22:
జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ సతీమణి కావ్య గత కొంత కాలముగా అనారోగ్యముతో భాదపడుతూ గురువారం తెల్లవారుజామున మరణించిన విషయం తెలుసుకున్న డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్ళి మృతదేహాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గుండె నిబ్బరం చేసుకుని మనోధైర్యంతో ఉండాలని గీకురు రవీందర్ కు దాసరి ప్రవీణ్ కుమార్ నేత సానుభూతిని తెలియజేశారు.ఈకార్యక్రమములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికారప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు పూల లచ్చిరెడ్డి తదితరులున్నారు.