జనగామ (జనం సాక్షి )ఫిబ్రవరి8: జనగామా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ సీనియర్ నాయకులు చెంచరపు శ్రీనివాస్ రెడ్డి ఉడుత రవి జిల్లా మహిళ అధ్యక్షురాలు బడికే ఇందిరా జనగామ పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ వంగళ మల్లారెడ్డి మాట్లాడుతు అసైన్డ్ భూమి కబ్జా చేస్తే ఆరేళ్ల జైలు శిక్ష అని చట్టం చెబుతుంది అలాంటిది మరి అధికార పార్టీ ఏకంగా 30 గుంటలు ఆక్ర మించుకొని జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించడం ప్రారంభించడానికి ఏకంగా సీఎం రావడం ఇదేనా టిఆర్ఎస్ పార్టీ నిజాయితీ , పేదవారికి 80 గజాల స్థలం ఇవ్వలేని ప్రభుత్వం మీరు మీ ప్రభుత్వ కార్యాలయానికి ఎకరం భూమి కేటాయించుకోవడం విడ్డురం,అది కాక అర ఎకరం అసైన్డ్ భూమిని ఆక్రమించుకోవడం ఇదెక్కడి చట్టం, ఇదెక్కడి న్యాయమో, జనగామ ప్రజలు ఆలోచించాలి అని… సీఎం జనగామ పర్యటన నేపథ్యంలో 2018 ఎన్నికల ప్రచారం లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ పాలిటెక్నిక్ నర్సింగ్ కాలేజీ ల హామీ నెరవేర్చాలని నూతన కలెక్టర్ కార్యలయం ముందు ఉన్న భూమి ఆక్రమణకు గురై పర్మినెంట్ నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఉరుకుంటున్నా రో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు…. అలాగే జనగామ జేఏసీ సీఎం రాకను నిరసిస్తూ ఈ నెల 11 న ఇచ్చిన జనగామ బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరు బంద్ లో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది .ఈ కార్యమంలో యూత్ ఈ కార్యక్రమం లో జనగామ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట కృష్ణ బడికే కృష్ణ లోక్కుంట్ల ప్రవీణ్ కర్రే రాజశేఖర్ మాజీద్ మిర్జా వేముల మల్లేష్ సోషల్ మీడియా కో కన్వీనర్ ఫయాజ్ ఎండీ యాసిన్ సౌడ మహేష్ ఎండీ ఆజామ్ సత్యనారాయణ శ్రీశైలం అనిల్ కనక స్వామి శ్రీను బెజడి హరీష్ కాముని శ్రీనివాస్ జానీ మియా తదితరులు పాల్గొన్నారుAttachments area




