జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో శుక్రవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 123 వ సారి అన్నదాన కార్యక్రమం దాత కీ.శే. పెద్ది అనసూర్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పద్మావతి మెడికల్ యజమాని రాజేందర్ సహకారంతో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు సింగతి తిరుమల్, బియ్యాల అంజయ్య, కందుల రాజన్న, నిచ్చకొల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.