జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.
అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 126 వ సారి అన్నదాన కార్యక్రమం దాత షేక్ సికిందర్ ఆయన జన్మదినం సందర్భంగా మరియు ఆయన తండ్రి షేక్ బాబుజానీ జ్ఞాపకార్థంగా యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గెల్లి రాజలింగు, దాత కుటుంబ సభ్యులు. జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శులు పతంగి సంతోష్, దాసరి రంజిత్ గౌడ్, సభ్యులు బియ్యల అంజయ్య, బొలిశెట్టి సుధాకర్, గుమ్ముల చందు, నిచ్చకోల సాయి ఈశ్వర్ పాల్గొన్నారు.