29 న గిరిజన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం -10 శాతం జీవో అమలు చేయాలి-గిరిజన అధ్యక్షులు
_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 28
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఈనెల 29న తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 10% జీవో అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం జిల్లాలో మొత్తం కార్యక్రమం విజయవంతం చేయాలని.. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కాట్రో ప్రకాష్ నాయక్. పిలుపునివ్వడం జరిగింది.. ఈ నెల 17న.. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కేంద్రానికి లెటర్ రాస్తానని తాడో పేడో తేల్చుకుంటాం అని చెప్పి వారాలు గడుస్తున్నా జీవో అమలు చేయకుండా దాని గురించి మాట్లాడకుండా కాలయాపన చేయడం సరైంది కాదని అన్నారు వెంటనే కెసిఆర్ గారు 10 శాతం రిజర్వేషన్ పై జీవో విడుదల చేసి తన నిజాయితీని కాపాడుకోవాలని అన్నారు ఈనెల 29న జరిగే అంబేద్కర్ కార్యక్రమాన్ని.. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అమలు చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు