*జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు కేటాయించాలి కుతాడి కుమార్*

చిలుకూరు అక్టోబర్,16(జనం సాక్షి)
 చిలుకూరు మండలంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నారాయణపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ ప్రధాన కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మా ఎరుకల కులస్తులు జనాభా శాతం మాకు రాజకీయాలలో విద్యా ఉద్యోగాలలో మా వాటా మాకు కేటాయించాలని చెప్పేసి మా యొక్క ఎరుకలకులస్తులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలు గుర్తించి మా ఎరుకల కులస్తులకి జనాభా ప్రాతిపదికన మా వంతు మా వాటా కేటాయించాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు అక్షయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షమయ్య రాష్ట్ర కోశాధికారి మదనపురం రఘు, రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు శ్యామల, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెలుగు నాగార్జున, చిరుమర్తి శేఖర్, వెంకట రాములు,సూర్యాపేట జిల్లా కన్వీనర్ నల్గొండ వెంకట్, కోకన్వీనర్ వెలుగు లింగయ్య, నల్గొండ జిల్లా కార్యదర్శి ప్రస్తాపూర్ వెంకన్న, సుల్తాన్ వెంకన్న, ఉమ్మడి జిల్లా నాయకులు శివ, గ్రామ శాఖ గ్రామ కమిటీ మెంబర్లు వెంకటాద్రి, సుల్తాన్ శ్రీనివాస్, రమేష్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు