సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మోహన్
డోర్నకల్ అక్టోబర్ 16 జనం సాక్షి
డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా మండల పరిధి మోదుగడ్డతండాకు చెందిన ధారవత్ మోహన్ నాయక్ ను నియమించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించిన టీపీసీసీ సోషల్ మీడియా విభాగం స్టేట్ కో-ఆర్డినేటర్ నవీన్ కు,నియమాకానికి సహకరించిన మాజీ మంత్రి బలరాం నాయక్,సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్,డిస్టిక్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి,నియోజకవర్గ నేత టిపిసిసి సభ్యులు నెహ్రూ నాయక్,మండల,గ్రామ,యూత్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.