జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: తూర్పు జపాన్‌లోని కాట్సూర నగర తీరప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు లేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.