ప్రారంభించనున్న సీ.ఎం కేసీఆర్
ప్రజలకు అవసరమైనది తెలంగాణకు హరితహారం
జిల్లాల్లో హరితహారం విజయవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి
హైదరాబాద్,జూలై10(జనం సాక్షి ): నాలుగో విడత తెలంగాణకు హరితహారాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా అమలు చేయాలని అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి ఆదేశించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు త్వరలోనే హరితహారాన్ని జయశంకర్ భూపాల పల్లి జిల్లా నుంచి ప్రారంభిస్తారని సీ.ఎస్ ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖాల జిల్లాల అధికారులతో చీఫ్ సెక్రటరీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం ఏర్పాట్లు, నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలు, ప్రజలు, సంస్థలు, విద్యార్థులను పెద్ద ఎత్తున హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు ఆయా జిల్లాల్లో చేసిన ఏర్పాట్లను సీ.ఎస్ సవిూక్షించారు. ప్రజా చైతన్యం, తద్వారా అన్ని వర్గాలను హరితహారంలో భాగం చేసినప్పుడు ఈ గొప్ప ఆశయంతో మొదలు పెట్టిన పథకం విజయవంతం అవుతుందని తెలిపారు. హరితహారం ఉపయోగాలపై విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తిని పెంచేందుకు ప్రతీ చోటా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థికి ఐదు మొక్కల చొప్పున పూలు, పండ్లు, నీడను ఇచ్చేవి ఇచ్చి, వాటి పెంపు బాధ్యతను అప్పగించాలన్నారు. అలాగే పర్యావరణం, హరితహారం ప్రాధాన్యతపై కవి సమ్మేళనం, సాంస్కృతిక శాఖ ద్వారా కళా జాతాల ప్రచారాన్ని విసృతంగా చేపట్టాలని సూచించారు. మంచి వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో వాటిని సద్వినియోగం చేసుకుని, ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న చోట్ల మొక్కలు నాటడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, జిల్లా కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. వర్షాలకు విరామం వచ్చి, మొక్కలకు నీరు అందని పరిస్థితి తలెత్తితే అవసరాన్ని బట్టి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఉపాధి హావిూ నిధులను ఇందుకోసం అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల అధికారులు, సిబ్బందికి హరితహారంపై శిక్షణ పూర్తి కావొస్తోందని, ఆ పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా నాటిన మొక్కల పర్యవేక్షణ ఉండాలన్నారు. అటవీ మొక్కలకు ప్రాధాన్యతను ఇస్తూ, కోతులు, ఇతర జంతువులు తినే పండ్ల జాతులను విసృతంగా నాటించాలన్నారు. అన్ని జిల్లాల్లో స్మృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని, తమ చనిపోయిన తమ ఆత్మీయుల పేరుతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణ బాధ్యత ఆకుంటుంబం తీసుకునేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పట్టణం, గ్రామాలకు దారి తీసే అప్రోచ్ రోడ్లు రహదారి వనాలతో చక్కగా తయారు కావాలన్నారు. గత మూడు హరితహారాల్లో చేసిన ప్లాంటేషన్లలో ఎక్కడైనా చనిపోయిన మొక్కలు, అంతరాలు( గ్యాప్) ఉంటే ఈ సారి
వాటిల్లో పూర్తి స్థాయిలో పెద్ద మొక్కలు నాటించాలన్నారు. మిషన్ బగీరథ పనులు చివరి దశలో ఉన్నందున, పైపు లైన్ల నిర్మాణంలో ఇప్పటికే నాటిన మొక్కలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహించి సామాజిక బాధ్యత కింద మొక్కల సంరక్షణ చేపట్టడం, ట్రీ గార్డులను స్పాన్సర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. సమావేశంలో సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయని తానంచర్ల నుంచి నకిరేకల్, సూర్యాపేట నుంచి జనగాం మధ్య రోడ్డు నిర్మాణం పూర్తి అయినంతవరకు అవెన్యూ ఎ/-లాంటేషన్ పనులు మొదలు పెడతామన్నారు. కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ వివరించిన జిల్లా హరితహారం ప్రణాళికను సీ.ఎస్ తో సహా ఉన్నతాధికారులు ప్రశంసించారు.
—————-




