Thursday, 5 November 2026

జయశంకర్‌ సార్‌కు నివాళి

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కంకణ బద్దులమై పాటుపడాలని శేరిలింగంపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 7 వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం లింగంపల్లి సర్కిల్‌ వద్ద గల జయశంకర్‌ సార్‌ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. జయశంకర్‌ సార్‌ కలలు గన్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జయశంకర్‌ సార్‌ చేసిన పోరాట పటిమ గొప్పదని చెప్పారు. జయశంకర్‌ సార్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ దుర్గం వీరేశం గౌడ్‌, సోమదాస్‌, బద్దం కొండల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రాజ్‌ ముదిరాజ్‌, రవీందర్‌ గౌడ్‌, సాయన్న, గోవింద్‌ చారి, శ్రీనివాస్‌ చారి, నర్సింహా గౌడ్‌, వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, శ్రీకళ తో పాటు నర్సింహా, మల్కయ్య, బ్రహ్మచారి, శ్రీనివాస్‌, వహీద్‌, డాకయ్య గౌడ్‌, పోచయ్య, కృష్ణ, గోపి, సురేష్‌, రాములమ్మ, విజయలక్ష్మి, కళ్యాణి, కమల తదితరులు పాల్గొన్నారు.