జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి…

 

 

 

– దోమకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముదాo శివ శంకర్ పటేల్
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్16 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నాడు నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముదాo శివశంకర్ పటేల్ మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టుల,ముఖ్యంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ముదాo శంకర్ పటేల్, బండారి శంకర్, బొమ్మెర బాలయ్య, భూపాల్ రాహుల్, సబ్బని ప్రవీణ్ కుమార్, గరిగే సురేష్, అంబాటి అనిల్ కుమార్, గోత్రాల విక్రమ్ పాల్గొన్నారు.