జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి
హత్నూర (జనం సాక్షి)
జర్నలిస్టుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.ఈ నెల 29న సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో టియుడబ్ల్యుజె,ఐజెయు సంఘాలు నిర్వహిస్తున్న జర్నలిస్టుల మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఆదివారం మండల కేంద్రమైన హత్నూరలో ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు.వివిధ సమస్యలపై నిరంతరం పదునైన కథనాలను పాఠకులకు చేరవేస్తూ ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా నిస్వార్థంగా పనిచేస్తున్నది జర్నలిస్టులేనని వారన్నారు. అనంతరం ఐజెయు జిల్లా ఉపాధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ ఎన్నో యేళ్ళుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న జిల్లా మహాసభకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆంజనేయులు గౌడ్,రమేష్, జావేద్,శ్రీశైలం,ఎంపీపీ నర్సింలు,జెడ్పీటీసీ ఆంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,సర్పంచి వీరస్వామి గౌడ్,పిఎసిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి,రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area