రైతు భూమిని కబ్జా చేసిన బి ఆర్ ఆర్ క్రషర్ యాజమాన్యం

చౌటుప్పల్ (జనం సాక్షి),
చౌటుప్పల్ మండల కైతాపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 80 లో పక్కనే ఉన్న బి ఆర్ ఆర్ క్రషర్ యజమాని చర్ల ఉప్పరి గూడెం సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల అధ్యక్షుడు రాంరెడ్డి తన క్రషర్ పక్కన ఉన్న రైతు ఎల్మ చంద్రారెడ్డి వ్యవసాయ భూమిలో ఆరు గుంటల భూమి కబ్జా చేసి రాత్రికి రాత్రి సిసి రోడ్ వేయడం జరిగింది. సదరు రోడ్డు నిర్మాణం ఆపేయాలని క్రషర్ ముందు ధర్నా చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మహిపాల్ రెడ్డి, రమేష్, నోముల రామచంద్రారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.