జర్నలిస్ట్ కుటుంబానికి పగడాల కనకయ్య ఫౌండేషన్ ఆర్థిక సహాయం.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్05(జనంసాక్షి)
ఇబ్రహీంపట్నం నందు ఐ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్న అంజికి ఈ మధ్య కాలంలో గుండెపోటు రావటంతో, హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 4వ తేదీన సర్జరీ చేసిన డాక్టర్ లు గుండెకు ఒక స్టంట్ అమర్చారు. అయినా పరిస్థితి బాగాలేకపోవటంతో ఈ రోజు మరో స్టంట్ అమర్చాలని డాక్టర్స్ చెప్పారు. మొదటి నుండి అంజి కుటుంబం ఆర్థికంగా బలహీనులు కావటంతో ఇబ్బంది పడుతున్నారు. సహచరుల ద్వారా సమాచారం అందుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు జర్నలిస్ట్ కుటుంబానికి తన సహాయాన్ని అందించారు. తన స్నేహితులను కలిసి వివరాలు తెలుసుకొని, 10 వేల రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తం స్నేహితుల ద్వారా అంజికి అందించారు. అంజి ఆరోగ్యం మెరుగుపడాలని ముత్తు కోరుకున్నారు. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలిచిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తుకు అంజి కుటుంబ సభ్యులు, స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద అని తెలుసుకొని వెంటనే స్పందించే పగడాల ముత్తు మరెన్నో సేవలు చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు