జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

వరంగల్‌,జనవరి7(జ‌నంసాక్షి): జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రావిూణ జిల్లా పరిధిలో ఆదివారం ముగ్గుల పోటీలు, భోగి మంటల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాగృతి జిల్లా నాయకులు చెప్పారు. మహిళల్లో సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్ధేశంతో జాగృతి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.. దీనిలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. పోటీల్లో పాల్గొని ప్రతిభకనబర్చిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు.