కూకట్ పల్లి జనంసాక్షి :జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు కోట్లాదిమందికి స్ఫూర్తి అని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గల గాంధీ విగ్రహనికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అహింసే ఆయుధంగా బ్రిటిష్ పాలకులను గడగడలాడించి.. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముని ఆశయాలు మనకు ఆదర్శమని అన్నారు. బాపూజీ చూపిన శాంతి, అహింస దారులను మన మార్గంగా మలుచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, కైసర్, అగ్రవాసు, బాలస్వామి, యాదగిరి, రాములుగౌడ్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, డివిజన్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, షేక్ బీబీ, రేణుక, సురేఖ, ప్రీతి, రాజుపటేల్, అశోక్, ఖాజా, మహేష్, రవీందర్, కూర్మయ్య, రమేష్ సాగర్, వాలి నాగేశ్వరరావు సంపత్, గోవింద్, అర్వరవి, కటికరవి నరసింహ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు కోట్లాదిమందికి స్ఫూర్తి … కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్..




