జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు , ( జనం సాక్షి) : మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు, ఎంపిటిసిలకు, ప్రజాప్రతినిధులకు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటి కొండ రాజయ్య చేతుల మీదుగా జాతీయ జెండా లను పంపిణీ చేశారు. డివిజన్ కేంద్రంలోని మండ ల ప్రజా పరిషత్ కార్యాలయం నందు  స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్టేషన్ ఘనుపూ ర్ మండలానికి సంబంధించి ఇంటింటికీ జాతీ య పతాకాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి పై జాతీయ జెండా ఎగు రవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏసీపీ రఘు చందర్, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి , ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, సీఐ ఎడ వెల్లి శ్రీనివాస రెడ్డి ,ఎస్ ఐ శ్రావణ్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు