Thursday, 5 November 2026

జాతీయ జెండా ఎగరవేసిన సంచలన సమితి నాయకులు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 17
హైదరాబాద్ సంస్థానం సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నైజాం పాలనా నుండి  విమోచనం చెంది  భారతదేశంలో విలీనం అయ్యి 75సంవత్సరములు సందర్భముగానైజాంవిముక్తస్వాంత్ర్యఅమృత్సవాలు17 సెప్టెంబర్ 2022, 17సెప్టెంబర్ 2023 సంవత్సరం పొడుగునా జరుపుటుకు ఆల్వాల్ నగర ప్రముఖులతో   నైజాం విముక్త స్వాంత్ర్య అమృత్సవాలు ఆల్వాల్ సర్కిల్ సంచలన సమితి వెంకటాపురం చౌరస్తాలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమములో విశ్వ హిందూ పరిషత్ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు, విద్యావేత్త శ్రీ సోమనాథ్ జీ ముఖ్య  వక్తగా హాజరయ్యార్రు.సోమనాథ్ జీ మాట్లాడుతూ నిజాం సంస్థానంలోరజాకార్లుచేసినఅక్రమాల్నిహత్యల్నిదురంతాల్నివిధ్వంసాలి.తేదీలవారిగా కథనం చేస్తే కనీసం లక్ష పుటల చరిత్రఅవుతుంది.1947 ఆగష్టు15 అర్ధరాత్రిభారతదేశానికిస్వాతంత్య్రం వచ్చింది. దేశం మూడుముక్కలైవచ్చినఈస్వాతంత్య్రం వెనుక అనేకమందివీరులత్యాగంఉంది.ఈస్వాతంత్య్రం వెనుకఅనేకమందిరక్తతర్పణమూఉంది.అదేరక్తతర్పణంఅదే వీరుల త్యాగం హైదరాబాద్ సంస్థానంలోనూఉంది. అయినా ఆ అర్ధరాత్రి ఇక్కడ స్వాతంత్య్ర భానూదయం కాలేదు. అందుకు కారకులు మతోన్మాది, నియంత నిజాం. అతని అడుగులకు మడుగులొత్తే రక్తపిశాచాలు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ రజాకార్లు.నిజాం సంస్థానం లేదా హైదరాబాద్ రాష్ట్రమంటే ఇప్పటి తెలంగాణా అంతా, మరియు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్ని జిల్లాలు ఉండేవి.నిజాం అందరూ ప్రజా పీడకులే, నియంతలే, చరిత్రలో రక్తపాతాన్నిసృష్టించినదుర్మార్గులే. హిందువుల మానప్రాణాలు హరించిన పరమ కిరాతకులే. అందులో చివరివాడైన ఏడో నిజాం అతి పరమ కిరాతకుడు. నరరూప రాక్షసుడు.హైదరాబాద్ సంస్థానంలోనిజాంలుమరియురజాకర్లుజరిపినఅత్యాచారాలు, బతుకమ్మ పండుగ సందర్భంగా కొన్నివేల ప్రదేశాల్లో స్త్రీలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించి వినోదించారు.రైతులు పండించిన కూరగాయలతో పాటు వారు పెంచుకొన్న కోళ్ళనూ, మేకల్ని, గొర్రెల్ని ఎత్తుకొని పోయిన ఘట్టాలు లక్షలున్నాయి. పొలాల్లో వ్యవసాయం పనుల మీదున్న స్త్రీలను ఎత్తుకొని వెళ్ళేవారు. రాత్రిపూట రజాకర్లు వచ్చి ఓ ఊరు మీద పడేవారు. తుపాకులు పేల్చేవారు. కొందరినిచంపేవారు. కొందరిమీద అత్యాచారం జరిపేవారు. కొన్ని ఇళ్ళు దోచుకునేవారు.స్త్రీలపైన కన్ను, ఆస్తిమీద కన్ను, భూమి మీద కన్ను, రాజ్యాల మీద కన్ను, దేవాలయం మీద కన్ను, భాషమీద కన్ను, సాహిత్యం మీద కన్ను, భక్తుల మీద కన్ను, ప్రతి మంచిదాని మీద కన్ను.రజాకర్లంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని అర్ధం. కాని శాంతిని నాశనం చేసి, మానవ రక్తాన్ని త్రాగిన రాకాసి మూకలు రజాకర్లు.90శాతం మంది హిందువుల మీద 10శాతంమందిముస్లింలఆధిపత్యంఉండేది.ఏపల్లెటూరిలో ఒక్క ముస్లిం ఉన్నా, అతని కుటుంబమున్నా అతనే రాజు అన్నవిధంగావ్యవహిరించడంజరిగేది.బతుకమ్మల నగ్న సత్యం: నిజాంకు హిందువుల పండుగలంటే పడదు. హిందూ మహిళలు బహిరంగంగా నిర్వహించే ఈ పండుగ ఆగిపోవాలి. బతుకమ్మ ఆటమీద దాడులు మొదలైనవి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళల్ని వివస్త్రల్ని చేసి ఆటాడించి ఆనందించే వరకు వెళ్ళింది.
ఓ నిజాము పిశాచమా! కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంగి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అని ఎలుగెత్తి చాటాడు దాశరథి అని చెప్పారు. అరుణ్ జి కార్యక్రమం ప్రారంభించారు. సురేష్ కొచ్చత్తిల్ జండా ఎగురవేశారు. ఈ కార్యక్రమములో జగన్నాథ్ జీ,కత్తిరాము,నైజాం విముక్త స్వాంత్ర్య అమృత్సవాలు ఆల్వాల్ సంచలన సమితి సంయోజకులు శ్రీనివాస బాల, సభ్యులు  డా.వెంకట్ సుబ్బారావు, దాసారం వెంకట్ రెడ్డి, ఐటీ మిలన్ కార్యవహ్ ప్రవీణ్, జిల్లా ప్రచార సంయోజకులు శ్రీనివాస వర్మ, వివిధ పార్టీల నేతలు, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ రెడ్డి, ఆల్వాల్ నగర ప్రముఖులు ఆల్వాల్ నగర ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Attachments area