జాతీయ రహదారి పనులను పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.

తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న బాపుర్ .. తాండూరు.. మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తున్న 167జాతీయ రహదారి పనులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తాండూరు ప్రాంతానికి జాతీయ రహదారి మంజూరు చేసి పనులను అత్యంత వేగవంతంగా కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వాటిని కేటాయించిన వాటికి కాకుండా వేరే అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సరిహద్దుల్లో ఉన్న తాండూర్ ప్రాంతం కీలక భూమిక ప్రదర్శిస్తున్న అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని, ఇక్కడున్న ఎమ్మెల్యే నిజంగా తాండూర్ అభివృద్ధి మీద చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా తాండూర్ అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. తాండూర్ అభివృద్ధికి ఉప ఎన్నికల మంత్రం ఒక్కటే సరైనదని  అభిప్రాయ పడ్డారు.ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే వ్యాపారాలు కొనసాగిస్తూ ఇక్కడే స్థిరపడిన ఎంతో మంది వ్యాపార సముదాయాలు కుల్చేస్తున్న, తాండూర్ అభివృద్ధి కోసం వాళ్ళే ముందుకు వచ్చి ఎంట్లాంటి అభ్యంతరాలు తెలపకపోవడం పైన ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.