జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్29(జనంసాక్షి)
జిల్లాలో జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 163జి వరంగల్- ఖమ్మం, 365 కురవి -ఖమ్మం, 9:30పి వలిగొండ- భద్రాచలం జాతీయ రహదారుల పనులకు సంబంధించిన పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 163 కి వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించి ఇప్పటికే జరిగిన భూసేకరణ 3డి నోటిఫికేషన్ చేయాలని అదేవిధంగా వలిగొండ -భద్రాచలం జాతీయ రహదారులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల జే.ఈ. మదన్ మోహన్ డి ఈ సూరిబాబు ఆర్డీవో కొమురయ్య సంబంధిత అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.